వేతన బకాయిలు ఇవ్వాలని దర్నా

వేతన బకాయిలు ఇవ్వాలని దర్నా

user-default | Mob: | 17 Sep

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి GGHసెక్యూరిటీ సిబ్బందికి వేతన బకాయిలు ఇప్పించాలని ధర్నా ::::::::::రెండు రోజుల్లో జీతాలు ఇవ్వకపోతే సమ్మె లోకి వెళ్తాము ::::::::::::ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు తాటిపాక మధు పిలుపు ::::::: ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సెక్యూరిటీ సిబ్బందికి గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని దీనివల్ల కార్మికుల ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక తెలిపారు. రెండు రోజుల్లో ఇవ్వకపోతే సమ్మెతప్ప వేరే మార్గం లేదని ఆయన పేర్కొన్నారు .మంగళవారం మూడు నెలల వేతనం ఇవ్వాలని ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు .అంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ రాఘవేంద్ర గారి తో చర్చలు జరిపారు .మధు తోపటు ఏఐటీయూసీజిల్లా ఉపాధ్యక్షులు పి ఎస్ నారాయణ ,ప్రభుత్వ ఏపీ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు స్వామి బాబు , యూనియన్ అధ్యక్షులు కె రామయ్య ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ చర్చిల్లో ఉన్నారు .ఈ ధర్నాను ఉద్దేశించి మధు మాట్లాడుతూ కార్మికులు మూడు నెలలుగా వేతనాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అర్ధాకలితో అలమటిస్తున్నారు పిల్లలకి ఫీజులు కట్టలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని దీనిపై ప్రభుత్వం ఉదాసీనతగా ఉందని ఆయన తెలియజేశారు .అదేవిధంగా 102 సిబ్బంది 2018 19 సక్రమంగా అమలు చేయలేదని ఆయన తెలిపారు కూడా ఏర్పాటు చేయకపోవడం దౌర్భాగ్యమని ఆయన తెలియజేశారు దీనిపై జిల్లా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఈ సమస్య పరిష్కారం చేయాలని ఆయన తెలియజేశారు .ఏఐటీయూసీ నాయకులు టి ఎస్ నారాయణ మాట్లాడుతూ జీతాలు బకాయిలు పిఎఫ్ తదితర సమస్యల మీద రేపటి నుంచి దశలవారీగా ఆందోళన చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సిహెచ్ కుమారి కోశాధికారి పీ దుర్గారావు కె.వెంకటేశ్ రమణమ్మ రాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved