హర్షకుమార్ క్షమాపణ చెప్పాలి?....పండుల

హర్షకుమార్ క్షమాపణ చెప్పాలి?....పండుల

user-default | Mob: | 17 Sep

బాధ్యతారహితంగా మాట్లాడితే అరెస్టు చేయాలి జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉంది: మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు హర్ష కుమార్ బోటు ప్రమాద బాధితుల కుటుంబాలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అమలాపురం మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు పాత్రికేయుల సమావేశంలో డిమాండ్ చేశారు. కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ రాజకీయ మనుగడ కోసమే బాధ్యతారహితంగా ఇష్టమొచ్చినట్లు హర్షకుమార్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, బోటు ప్రమాదంలో 77 మంది చనిపోతే దానిని 93 మంది కింద చిత్రీకరించిన హర్షకుమార్ ఆధారాలను చూపించాలన్నారు. బోటు ప్రమాదం జరిగినప్పటి నుండి నలుగురు మంత్రులు అక్కడ ఉండి రాత్రి పగలు పర్యవేక్షిస్తున్నారన్ని, ఏ ఆధారాలతో హర్ష కుమార్ మాట్లాడారో ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బోటు ప్రమాదంలో బాధితులు చనిపోతే వాళ్లు అసాంఘిక కార్యక్రమాలకు వెళ్లి చనిపోయారన్ని చెప్పడం ఎంతవరకు సమంజసమని, బేషరతుగా బాధిత కుటుంబాలకు వెంటనే హర్ష కుమార్ క్షమాపణ చెప్పాలన్నారు. మరో మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు దళితులకు అన్యాయం జరిగితే ప్రశ్నించలేని వాళ్లు ఇప్పుడు మాట్లాడుతున్నారని, అనేక కేసులున్న చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేయించిన ఘనత ఒక్క జగన్ కే దక్కుతుందన్నారు. ఒక చింతమనేని ప్రభాకర్ ను అరెస్టు చేయిస్తే రాష్ట్రంతో పాటు దేశంలో దళితులందరూ హర్షించారన్ని, నియోజకవర్గంలో దళితులపై దాడులు జరిగితే నోరుమెదపని మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మాట్లాడుతున్నారని ఏ మొఖం పెట్టుకొని మాట్లాడుతున్నారన్నారు. జగన్ ప్రభుత్వం వంద రోజుల పరిపాలన బ్రహ్మాండంగా ఉందని మొదటి సంవత్సరం పథకాలను విస్తరించి మిగతా నాలుగు సంవత్సరాలు ఫలితాలను ఆశించడం ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved