ఈ ముగ్గరు ఎవరో తెలుసా మీకు?

ఈ ముగ్గరు ఎవరో తెలుసా మీకు?

user-default | Mob: | 17 Sep

వీరి గురించి చాలా మందికి తెలియదు. వీరు ముగ్గురి పోరాట ఫలితమే సమాచార హక్కు చట్టం – 2005 . వీరిలో మధ్యలో ఉన్న ఆవిడే శ్రీమతి అరుణారాయ్ IAS. తను ఉధ్యోగ నిర్వహణలో పేదలకు, అణగారిన వర్గాలకు దక్కాల్సిన పథకాలు వారికి దక్కటల్లేదనే ఉద్ధేశ్యంతో తను ఉధ్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, పేదల తరుపున తన గొంతు వినిపించడంలో ముందున్నారు. ఎడమవైపు నుండి ఉన్న మొదటి వ్యక్తి శంకర్ సింగ్. వీరు సామాజిక కార్యకర్త. కుడివైపు నుండి ఉన్న మొదటి వ్యక్తి నిఖిల్ డే. వీరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళి గ్రామీణులకు స్వదేశంలో జరుగుచున్న అన్యాయాలపై నినంధించాలని తపనతో విదేశీ విద్యకు స్వస్తిచెప్పి వచ్చిన వ్యక్తి. పై ముగ్గురూ కలసి రాజస్థాన్ లోని దేవదుంగ్రి గ్రామంలో 1987 మేడే నాడు మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ అనే సంస్థ ప్రారంభించి సాగించిన ఉధ్యమ పలితమే సమాచార హక్కు చట్టం. అందుకే వారిని మనం ఎప్పుడూ అభినందించాల్సిందే.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved