మెక్‌డొనాల్డ్స్‌ను బాయ్‌కాట్‌ నెటిజన్లు

మెక్‌డొనాల్డ్స్‌ను బాయ్‌కాట్‌ నెటిజన్లు

user-default | Mob: | 17 Sep

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో తరహాలో ప్రస్తుతం మెక్‌డొనాల్డ్స్‌ కూడా నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ‘మేము హాలాల్‌ మాంసం కూడా సరఫరా చేస్తాం’ అనే ట్యాగ్‌తో జొమాటో చేసిన ట్వీట్‌కి నెటిజన్ల నుంచి విమర్శల వర్షం వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మెక్‌డొనాల్డ్స్‌ ఇండియాపై కూడా నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ‘మెక్‌డొనాల్డ్స్‌ ఇండియా హలాల్‌ సర్టిఫికెట్‌ ను కలిగి ఉందా’ అని ఓ కస్టమర్‌ అడిగిన ప్రశ్నకు బదులుగా.. భారతదేశంలోని వారి రెస్టారెంట్లన్నింటికీ హలాల్ సర్టిఫికెట్ ఉందని, వారు ఉపయోగించే మాంసం కూడా అత్యధిక నాణ్యతతో ఉంటుందని మెక్‌డొనాల్డ్స్‌ సమాధానం ఇచ్చింది. అంతేకాక వాటికి ప్రభుత్వ ఆమోదం పొందిన హేచ్‌ఎసీసీపీ(హజార్డ్ అనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్) సర్టిఫికేట్ కూడా ఉందని తెలిపింది. అదేవిధంగా ‘మా రెస్టారెంట్లన్నింటికీ హలాల్ సర్టిఫికెట్లు ఉన్నాయి. కావాలంటే సంబంధిత రెస్టారెంట్ యజమానులను ధృవీకరణ పత్రాన్ని చూపించమని అడిగి మీ సందేహన్ని తీర్చేకోవచ్చు’ అంటూ ట్విటర్‌ వేదికగా పేర్కొంది. ఈ క్రమంలో ముస్లిమేతర మెజారిటీ దేశంలో హలాల్ మాంసం విక్రయానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మెక్‌డొనాల్డ్స్‌ ఇండియాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బాయ్‌కాట్‌మెక్‌డొనాల్డ్స్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో నిరసన తెలియజేస్తున్నారు. ‘హిందువులు జాట్కా మాంసాన్ని మాత్రమే తింటారు, మన సంప్రదాయం కూడా అదే చెబుతోంది. ఇప్పటికైనా మీరు దీన్ని ఆపకుంటే మీ వద్ద మాంసాహర పదార్థాల విక్రయాన్ని తగ్గించాల్సి ఉంటుంది. అప్పడు మీరు భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని హెచ్చరిస్తూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. కాగా జూలై నెలలో జొమాటో ‘ఆహారానికి మతం లేదు’ అని ట్విటర్‌ పోస్ట్‌ చేసి అభాసుపాలైన విషయం తెలిసిందే. ఈ ట్వీట్‌పై స్పందించిన నెటిజన్లు.. ‘ఆహారానికి మతం లేనప్పడు మరెందుకని హలాల్‌ మాంసం అని ప్రత్యేకంగా ట్యాగ్‌ను చేర్చారు’ అంటూ విమర్శించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved