ప్రతి విద్యార్థి ఉత్తమ పౌరుడుగా ఎదగాలి

ప్రతి విద్యార్థి ఉత్తమ పౌరుడుగా ఎదగాలి

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

ప్రతి విద్యార్థి ఉత్తమ పౌరుడుగా ఎదగాలని23వ డివిజన్ కార్పొరేషన్ మీసాల శ్రీదేవి దుర్గాప్రసాద్ తెలిపారు. గురువారం స్థానిక జగన్నాధపురం యం.యస్.యన్ . చారిటీసు ఎయిడెడ్ ఉన్నత పాఠశాల లో జగనన్న విద్యా కానుకలో భాగంగా విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన 23 వ డివిజన్ కార్పొరేషన్ మీసాల శ్రీదేవి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ జగనన్న విద్యా కానుకను వినియోగించుకుని ప్రతి విద్యార్థి ఉత్తమ పౌరుడుగా రూపొందాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమం దేశంలోనే అత్యున్నతమైన కార్యక్రమమని అన్నారు . ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ యం.యస్.యన్ . చారిటీసు విద్యాసంస్థల కరస్పాండెంట్ బి.వి.ఎస్ . దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉత్తమ విద్యార్ధిగా రూపొందించాలని మంచి ఆశయంతో ఏర్పాటు చేసిన పథకమే ఈ జగనన్న విద్యా కానుక అన్నారు . మంచి లక్షణాలను నేర్చుకుని విద్యను అభ్యసించాలన్నారు యం.యస్.యన్ . చారిటీసు విద్యాసంస్థల ఛైర్మన్ మల్లాడి శివరామనాయకర్ మాట్లాడుతూ విద్యతోనే సామాజిక అభివృద్ధి సాధ్యమన్నారు . ఈ కార్యక్రమంలో పేరెంట్ కమిటీ ఛైర్మన్ ప్రభాకరరావు , ఉపాధ్యాయులు బి . సంపత్ కుమార్ , యం.వి.యస్ . రామకృష్ణ , బి . నాగేశ్వరరావు , పి . ధనలక్ష్మి , జి . సూరిబాబు , కేసరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved