జిల్లాకు ఎలక్ట్రికల్‌ బస్సులు రాజమహేంద్రవరానికి 50, కాకినాడకు 50 కేటాయింపు

జిల్లాకు ఎలక్ట్రికల్‌ బస్సులు రాజమహేంద్రవరానికి 50, కాకినాడకు 50 కేటాయింపు

user-default | Mob: | 17 Sep

జిల్లాలోని ప్రయాణికులకు ఆర్టీసీ ఎలక్ట్రికల్‌ బస్సు(ఈ-బస్సు) సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. జిల్లాకు వంద బస్సులు రానుండగా వీటిలో 50 బస్సులను రాజమహేంద్రవరం డిపోకు, మరో 50 బస్సులను కాకినాడ డిపోకు కేటాయించ నున్నారు. వీటిని ఏఏ సమయాల్లో ఏఏ రూట్లలో తిప్పాలనే అంశంపై గురువారం రాజమహేంద్రవరంలోని ఆర్టీసీˆ డిపోలో అధికారులు సమావేశమై చర్చించారు. ఎలక్ట్రికల్‌ బస్సుల ఛార్జింగ్‌కోసం జిల్లాలోని రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం డిపోల్లో ఛార్జింగ్‌ పాయింట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పాయింటుకు 50×65 అడుగుల విసీˆ్తర్ణంలో స్థలం అవసరమవుతుంది. మూడు డిపోల్లో పాయింట్ల ఏర్పాటుకు ఒక్కో దానికి రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.15కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రధానంగా రాజమహేంద్రవరం డిపో నుంచి నాలుగు రూట్లతో ఈ బస్సులను తిప్పాలని నిర్ణయించారు. ఒక్కో ఎలక్ట్రికల్‌ బస్సు ఖరీదు రూ.1.50 కోట్ల నుంచి రూ.2కోట్లు ఉంటుందని చెబుతున్నారు. 12 మీటర్ల పొడవుండే ఒక్కో బస్సులో 40 సీˆట్లు ఉంటాయి. 2.50 టన్నుల బరువుండే ఆరు బాటరీలు ఉంటాయి. వీటికి రాత్రి సమయంలో ఆరు గంటలపాటు ఛార్జింగ్‌ పెట్టాల్సి ఉంటుంది. తర్వాత బస్సు తిరిగేటప్పుడు ట్రిప్పు ట్రిప్పునకు రెండు గంటల చొప్పున ఛార్జింగ్‌ పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఛార్జింగ్‌ పెట్టడం వల్ల 150 కిలోమీటర్ల వరకు బస్సు నడుస్తుందని అధికారులు చెబుతున్నారు. దీనికి కిలోమీటరుకు రూ.6 వంతున ఖర్చవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం డిపో నుంచి పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ లగ్జరీ, డీలక్స్‌ బస్సులతో కలిపి మొత్తం 150 సర్వీసులు తిప్పుతున్నారు. డీజిల్‌ ఖర్చు కిలోమీటరుకు రూ.15 అవుతుందని ఆర్టీసీˆ అధికారులు చెబుతున్నారు. దీంతో పోల్చుకుంటే ఎలక్ట్రికల్‌ బస్సుల నిర్వహణ భారం చాలా వరకు తగ్గుతుందని భావిస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి తునికి 18 బస్సులు, కాకినాడకు 20, విజయవాడకు 6, అమలాపురానికి 6 తిప్పేందుకు ప్రతిపాదించారు. దీనికి ముందు ఈ-బస్సులు, ఛార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటుకు అయ్యే ఖర్చు మొత్తం ఆర్టీసీˆ సంస్థే భరించాలా.., ప్రభుత్వం రాయితీ కల్పిస్తుందా.. అనే విషయంలో అధికారుల్లో ఇంకా స్పష్టత లేదు. ఎలక్ట్రికల్‌ బస్సులు వచ్చిన తర్వాత వాటిని నడిపేందుకు సంబంధిత కంపెనీయే నిర్ణీత వారంటీ గడువు వరకు ప్రత్యేకంగా డ్రైవర్లను నియమిస్తుందని ఆర్టీసీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ జి.వరలక్ష్మి తెలిపారు. ఆ తర్వాత నిర్వహణ బాధ్యతలను ఆర్టీసీˆ చేపడుతుందన్నారు. ఎలక్ట్రికల్‌ బస్సులు తిప్పే రూట్లు, ఛార్జింగ్‌ పాయింట్ల ఏర్పాటు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో పలు దఫాలు సమావేశమై చర్చిస్తామని, తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని ఆమె వివరించారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved