పిటిషన్‌ను ఉపసంహరించుకున్న టిక్‌టాక్‌..

పిటిషన్‌ను ఉపసంహరించుకున్న టిక్‌టాక్‌..

user-default | Mob: | 17 Sep

చైనాకు చెందిన వీడియో యాప్‌ టిక్‌టాక్‌ను బ్యాన్‌ చేయాలని మద్రాస్‌ హైకోర్టు ఈ కేసును భారత అత్యున్నత న్యాయస్థానానికి బదిలీ చేసింది. దీంతో రంజన్‌గొగొయి సారథ్యంలోని ధర్మాసనం.. ఈ కేసులోని సమస్యలను మద్రాస్‌ హైకోర్టు పరిష్కరించగలదు. ఈ బదిలీ చేసిన వ్యాజ్యాన్ని మేము స్వీకరించలేము అని వెల్లడించడంతో.. టిక్‌టాక్‌ గురువారం తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. టిక్‌టాక్‌ యాప్‌లో అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలు వస్తున్న కారణంగా అవి పిల్లలపై చెడు ప్రభావం చూపుతాయనే ఉద్దేశంతో ఏప్రిల్‌4న హైకోర్టు ఈ యాప్‌పై బ్యాన్‌ విధించిన సంగతి తెలిసిందే.. అయితే బ్యాన్‌ ఎత్తిఏస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వమని టిక్‌టాక్‌ సంస్థ అపెక్స్‌ కోర్టును ఆశ్రయించింది. దీంతో అపెక్స్‌ కోర్టు సూచించిన మేరకు ఏప్రిల్‌ 24న మధురై బెంచ్‌ సారథ్యంలోని మద్రాస్‌ హైకోర్టు యాప్‌పై బ్యాన్‌ ఎత్తివేసి, కేసును పరిశీలనలో ఉంచింది.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved