వారి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి

వారి సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

సరిహద్దుల్లో చైనా బలగాలతో జరిగిన పోరాటంలో ప్రాణాలు విడిచిన 20 మంది భారత వీర జవాన్ల దేశ ముద్దుబిడ్డ లని బిజెపి కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ తెలిపారు శుక్రవారం కాకినాడలో వీర జవాన్ల స్తూపం వద్ద చైనా దాడిలో మృతి చెందిన సైనికుల చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైనా వస్తువులు పూర్తిగా బహిష్కరించాలని కోరారుదేశ సంరక్షణ కోసం జవాన్లు ఎనలేని త్యాగం చేస్తున్నారని కొనియాడారు. మన కోసం, మన దేశం కోసం ఎంతో మంది దేశ సరిహద్దుల్లో పోరాడుతున్నారని, వారి వల్లే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నామన్నారు. భౌతికంగా వారు మన మధ్య లేకపోయినా వారి సేవలు శాశ్వతంగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మాలకొండయ్య సూర్యనారాయణ రాజు ,పైడా కృష్ణ మోహన్ ,డా.డివికె రాజు , లక్ష్మీ ప్రసన్న శ్రీనివాస్ గట్టి సత్యనారాయణ జ్యోతి రాజేష్ బాబ్జి సాయి తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved