పన్ను కట్టరు.. అడిగితే స్పందించరు   ... కార్పొరేషన్‌కు ప్రభుత్వ సంస్థల బకాయిలు

పన్ను కట్టరు.. అడిగితే స్పందించరు   ... కార్పొరేషన్‌కు ప్రభుత్వ సంస్థల బకాయిలు

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

కాకినాడ కార్పొరేషన్ కు మొండి బకాయిలు షాక్ తగులుతుంది జిల్లా కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయం తో పాటు పలు ప్రభుత్వ సంస్థలు నగరపాలకసంస్థకు ఆస్తి పన్ను బకాయిలు రూ.30 కోటికి పైగా చెల్లించాల్సి ఉంది. దీనిపై కార్పొరేషన్‌ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసినప్పటికీ జిల్లా అధికారుల నుంచి స్పందన నామ మాత్రం ఉంది దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి 30 కోట్లు పైగా పన్ను బకాయి ఏర్పడ్డాయి . ప్రైవేటు సంస్థల నుంచి కూడా 17 కోట్లు పైగా మొండి బకాయిలు కొనడంతో కార్పొరేషన్ లో అభివృద్ధి కార్యక్రమాలు కుంటి పడుతున్నాయి దీనికితోడు లౌక్ డౌన్ ప్రభావంతో పన్నులు వసూలు నామమాత్రంగానే వసూలు అవుతున్నాయి కాకినాడ ,రాజమహేంద్రవరం నగరపాలకసంస్థతో పాటు పిఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, తుని, మండపేట, రామచంద్రపురం ,అమలాపురం పురపాలక సంఘాలతోపాటు మూడు నగర పంచాయతీ లలో చెల్లించాల్సిన ఆస్తి పన్ను బకాయిల విషయంలో ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఈ ఏడాదిరూ.11.20 కోట్ల మేర కాకినాడ కార్పొరేషన్‌కు బకాయి పడ్డాయి. గతంలో 20 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఈ ఏడు తో కలిపి 31.20 లక్షల పన్ను బకాయిలు కార్పొరేషన్ కి చెల్లించవలసి ఉంది ఆ శాఖలు, సంస్థలకు కార్పొరేషన్‌ చెల్లించాల్సిన బకాయిల విషయంలో మాత్రం వారు తమదైన శైలిలో చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అదే నగరపాలకసంస్థ అధికారులు ఉపక్రమిస్తే మాత్రం వారు ఉగ్రరూపం దాల్చుతున్నారు. ప్రభుత్వ స్థాయిలో పైరవీలు సాగించడం, అధికారులపై మొట్టికాయలు వేయించడం చేస్తున్నారు. డిమాండ్‌ రూ.45 కోట్లు కాకినాడ నగరపాలకసంస్థకు ఆస్తి పన్ను,నీటి పన్నులు కింద దాదాపు రూ. 45కోట్ల వరకు వసూలు కావాల్సి ఉంది. ఇందులో రూ.16.55కోట్ల వరకు నగరవాసులు చెల్లించగా.. రూ.29.45 కోట్ల వరకు ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలు బకాయిలు ఉన్నాయి. వీరితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల ప్రతినిధులు, కొందరు వ్యాపారులు బకాయిలు ఉన్నారు. సామాన్యులపైనే ప్రతాపం రూ.500ల నుంచి రూ.1000 వరకు బకాయిలు ఉన్న పేద, మధ్య తరగతి సాధారణ వ్యక్తులపై మాత్రం నగర, పురపాలకసంస్థల అధికారులు తమ ప్రతాపం చూపుతున్నారు. అటువంటి వారిపై ఆర్‌ఆర్‌ యార్టులు ప్రయోగించడం, నీటి కుళాయిలు కనెక్షన్లు కత్తిరించడం వంటి చర్యల ద్వారా తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. భారీగా బకాయిలు పడిన బడా బాబులు, పెద్దలు, రాజకీయ నాయకుల వైపు మాత్రం కన్నెత్తి చూసేందుకు సాహసించలేకపోతున్నారు. ఫలితంగా రూ.కోట్లలో బకాయిలు ఉన్నాయి. వాటి తీరే వేరు.. ప్రభుత్వ సంస్థల నుంచి బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ప్రభుత్వ సంస్థలకు ప్రస్తుత ఏడాది సంబంధించి 476 అసెస్‌మెంట్లపై రూ.11.80 కోట్లు మేర పన్నులు రావాల్సి ఉంది. రైల్వే, ఆర్టీసీ, వ్యవసాయ,జిల్లాకలెక్టరేట్ మత్స్యశాఖ, విద్యుత్తు, ఆర్టీసీ, రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్‌, పోలీసు, తపాలా తదితర శాఖలు రూ.కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ సంస్థల అధికారులకు పలుమార్లు నోటీసులు జారీ చేసినా కనీసం స్పందించడం లేదు. కొన్ని శాఖలు మాత్రం రూ.కోట్లలో బకాయిలు ఉండగా అప్పుడప్పుడు రూ.లక్షలు జమచేస్తూ సాగతీత ధోరణి అవలంభిస్తున్నారు. ప్రైవేటు సంస్థలు 78,262 అసెస్‌మెంట్లపై రూ.17.65లక్షల పన్నుల బకాయలు పడ్డారు. నీటి పన్ను వసూలు నామమాత్రం కాకినాడ నగరంలో 40 214 కులాయి కలెక్షన్లు ఉన్నాయి వీటిలో రెండు వందల రూపాయలు సామాన్య కలెక్షన్లు 30, 457 ఉండగా 17 57 కమర్షియల్ కలెక్షన్లు ఉన్నాయి సాధారణ కుళాయి కనెక్షన్లు ద్వారారూ.7.66 పన్ను వసూలు అవుతుండగా 17 57 కమర్షియల్ కుళాయిల ద్వారారూ.9.49లక్షల రూపాయలు పన్ను రూపంలో కార్పొరేషన్ కు ఆదాయం సమకూరుతుంది ఈ ఏడాది రూ17.10లక్షల గాను కేవలం71 లక్షలు మాత్రమే వసూలు అయింది సర్వర్ డౌన్.. ఒకపక్క ప్రజలను లాక్ డౌన్ ఇబ్బంది పెడుతుంటే మరోపక్క మున్సిపాలిటీలో సర్వర్ పని చేయక పన్ను చెల్లింపుదారులు అష్టకష్టాలు పడుతున్నారు చెల్లించేందుకు మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లిన సర్వర్ పనిచేయకపోవడంతో పన్ను కట్టకుండా వెన్న తిరుగుతున్నారు 15 గ్రామ సచివాలయాలలో కౌంటర్లు ఏర్పాటు.. నగరంలో పన్ను వసూలు చేసేందుకు కాకినాడ కమిషనర్ స్విప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు కాకినాడ కార్పొరేషన్ కౌంటర్ తో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే 15 గ్రామ సచివాలయాలలో పన్నులు వసూలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved