జీతాలు ఇప్పించండి మహాప్రభో

జీతాలు ఇప్పించండి మహాప్రభో

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

జిల్లా సాంఘీకసంక్షేమ శాఖ లో ప నిచేస్తున్న 23 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగులకు పది నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పాడుతున్న నేపథ్యంలో ప్రభుత్వానికి , జిల్లా అధికారులకు సమస్యను విన్నవించుకున్నా పట్టించుకోకపోవడంతో జిల్లా హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం డి డి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సంఘ నాయకులు అభి రెడ్డి శ్రీనివాస్, పి ప్రభాకర్, వై వెంకట్రావు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో సోషల్ వెల్ఫేర్ డిడి గా పనిచేసిన శోభ రాణి 23 మందిహాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లను బదిలీ చేయడం జరిగిందన్నారు రెండు నెలలపాటు ట్రెజరీ ద్వారా జీతాలు రావడం జరిగిందని అయితే వివిధ కారణాల వల్ల జీతాలు గత పది నెలలుగా నిలిపి వేయడం జరిగిందన్నారు ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా అధికారులకు వినతిపత్రం రూపంలో ఇవ్వడం జరిగిందని తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జీతాలు లేక కుటుంబాన్ని కూడా పోషించు కోలేని పరిస్థితి నెలకొందన్నారు తక్షణమే జిల్లా కలెక్టర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved