ఆలయాల్లో జాగ్రత్తలు పాటించాలి

ఆలయాల్లో జాగ్రత్తలు పాటించాలి

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

కరోనా నేపధ్యంలో ఆలయాలు తెరుచుకున్న సందర్భంగా ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు భక్తులు పాటించేలా చూడాలని వైఎస్సార్ కాంగ్రెస్ సిటి కో ఆర్డినేటర్ శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం కోరారు.తన కార్యాలయంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్, ఆలయాల ఈఒలతో సుబ్రహ్మణ్యం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ లాక్ డౌన్ సడలింపులో భాగంగా ఆలయాలను తెరుచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపధ్యంలో దేవాలయాల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి సామాజిక దూరం పాటించేలా చూడాలన్నారు. దేవాలయాల్లో పాటించాల్సిన జాగ్రత్తలను భక్తులకు ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉండాలని సూచించారు.ఆలయాలకు చెందిన ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయని, దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.దేవాలయాలు,సత్రాల ఆదాయం పెంచడానికి మార్గాలు అన్వేషించాలని, దాతలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వారి ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ఏళ్ళ తరబడి ఒకే స్థానంలో ఉండిపోయిన ఉద్యోగుల విషయంలో స్థాన చలనం కల్పించాలని అన్నారు. కొన్ని ఆలయాల్లో భక్తుల కానుకలను ఆలయ అవసరాలకు,సిబ్బంది జీతాలకు వినియోగించడం సరికాదని,దాతలు సమర్పించే కానుకలు,సహాయం నమోదు కావాలని అన్నారు.ఇటీవల మార్కండేయేశ్వర స్వామి ఆలయం 40 లక్షల ఆదాయం, జాంపేట ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని 5 లక్షలతో అభివృద్ధి చేస్తున్నని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ఈవోలు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved