ప్లాస్టిక్ రహిత సహాజాన్ని నిర్మిద్దాం

ప్లాస్టిక్ రహిత సహాజాన్ని నిర్మిద్దాం

user-default | Mob: | 17 Sep

ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనిబాలవేదిక కన్వీనర్ నోరు బలరామకృష్ణ తెలిపారు ప్రపంచ పర్యావరణ దినోత్సవమును పురస్కరించుకుని శుక్రవారం కాకినాడలో జిల్లా విద్యాశాఖ , ది గ్రీన్ ఇండియా ఫౌండేషన్ , వి.బి.వి.ఆర్ . చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక జగన్నాధపురం యం.యస్.యన్ . చారిటీస్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా జిల్లాస్థాయి చిత్రలేఖన పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన బాలవేదిక కన్వీనర్ నోరు బలరామకృష్ణ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా వాతావరణంలో విపరీత మార్పులు సంభవిస్తున్నాయని అన్నారు . ప్రజలు తట్టుకోలేనటువంటి ఉష్ణోగ్రతలు మనం చూస్తున్నామని అన్నారు . ప్లాస్టిక్ కాలుష్యాన్ని నిరోధించకపోతే భవిష్యత్ అందంకారంగా మారుతుందని తెలిపారు . ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ప్లాస్టిక్ ని విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు . భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించే బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు . పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం.యస్ . సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు . ప్రజలు కాకినాడ నగరాన్ని గ్రీన్ సిటీగా రూపొందించే మహోత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు . కాకినాడ ఆహ్లాదకరమైన ఆనందదాయకమైన తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని తెలిపారు . ప్రతి ఒక్కరూ విదిగా మొక్కలు నాటడం , పరిశుభ్రత పాటించడం అలవర్చుకోవాలని తెలిపారు . ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కె.వి.వి.ఎస్ . ప్రసాద్ మాట్లాడుతూ మొక్కలు నాటడం జీవితంలో భాగం చేసుకోవాలని అన్నారు . సామాజిక వనాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు . ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత అన్నారు . ఈ కార్యక్రమంలో ది గ్రీన్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు పిల్లి గోవిందరాజులు , ఏ . సత్తిబాబు , కె.వి.ఎస్.ఎస్ . ప్రసాద్ , ఫరెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కె . రాంబాబు , ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ . సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved