ఇంటికే పౌష్టికాహారం పంపిణీ

ఇంటికే పౌష్టికాహారం పంపిణీ

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని లబ్ధిదారులకు పోషకాహారం అందేలా చూడాలని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాధ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి సూచించారు. కాకినాడ లో సామ మూర్తి నగర్ లో అంగన్‌వాడీ కేంద్రాల్లో శుక్రవారం పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ లాక్‌డౌన్‌ పొడిగించడంతో గర్భిణులు, చిన్నారులు, బాలింతలు ఇబ్బంది పడకుండా ఇంటివద్దకే పౌష్టికాహారం అందజేస్తామని తెలిపారు. బాలింతలు, గర్భిణులకు బియ్యం 2 కేజీలు, కందిపప్పు 400 గ్రా, మంచినూనె 250 గ్రా, కోడిగుడ్లు 30, పాలు మూడు లీటర్లు అందించనున్నట్లు చెప్పారు. బాల సంజీవని పథకం ద్వారా చిన్న పిల్లలకు బాలామృతం పౌష్టకాహారం నేరుగా ఇంటికే పంపించనున్నట్లు పేర్కొన్నారు.ఈ క్రమంలో జిల్లాలో 24,979 మంది గర్భిణులు, 20,242 బాలింతలు, 1,55,985 చిన్నారులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో మండల ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారిణి తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved