జిల్లా పోలీసులు బాగా పనిచేశారు : ఎస్పీ అస్మి

జిల్లా పోలీసులు బాగా పనిచేశారు : ఎస్పీ అస్మి

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

కరోనా విపత్తుసమయంలో జిల్లా పోలీసులు బాగా పనిచేశారని జిల్లా ఎస్పీ అద్నాం నయీమ్ అస్మి కొనియాడారు. తుని జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను బుధవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి వలస కార్మికులకు భోజనాలు అందించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని, అదేసమయంలో ప్రభుత్వం, జిల్లా అధికారులు చేసిన సూచనలను పోలీసులు సక్రమంగా అమలు చేసి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గత నెల 15 వ తేది నుండి ఇప్పటివరకు సుమారు 18 వేల మంది వలస కార్మికులకు ప్రతిరోజూ భోజన సదుపాయాలు కల్పించడం జరిగిందని, ఇందుకు సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పోలీసు విశ్రాంతి మందిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, తుని అర్బన్, రూరల్, పెద్దాపురం సిఐ లు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved