ఇసుక సరఫరా లో సమస్యలను పరిష్కరించాలి..జిల్లా కలెక్టర్

ఇసుక సరఫరా లో సమస్యలను పరిష్కరించాలి..జిల్లా కలెక్టర్

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

జిల్లాలో నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలక్బర్ డి.మురళీధర్ రెడ్డి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు . పోమవారం కాకినాడ కలక్టర్ కార్యాలయంలో కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధ్యక్షతన నాడు - నేడు , సామాన్య ప్రజలకు ఇసుక సరఫరా లో ఎదురౌతున్న సమస్యలు , నివారణ చర్యలు , సిమెంట్ , సిరామిక్ రంగాల సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు . ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో చేపడుతున్న నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారన్నారు . కాబట్టి ప్రాధాన్యత అంశాలు అనుగుణంగా నిర్మాణ పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలన్నారు . నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా నిర్మాణాలు చేపడుతున్న సంబంధిత ఎమ్ఇఓలు , హెచ్ఎమ్ లు నిర్లక్ష్యం విడిచి పెట్టి తిరిగి పాఠశాలలు ప్రారంభించే నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు . అలక్ష్యం వహించిన వారి పై కఠిన చర్యలు తప్పవని కలక్టర్ తెలిపారు . అదే విధంగా పాఠశాలల్లో జరిగిన నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా సరఫరా చేయాలన్నారు . ఈ రోజు నుండి ఒక వారం రోజుల పాటు సామాన్య ప్రజలకు , నాడు - నేడు కార్యక్రమంలో చేపట్టే నిర్మాణ పనులు మినహ , ప్రభుత్వ , ప్రైవేట్ ఇసుక బల్క్ ఆర్డర్లు నిలిపి వేయాలని జిల్లా ఇసుక అధికారినికి కలక్టర్ సూచించారు . ఇసుక ర్యాంప్ వద్ద సిసి కెమెరాలు , వెయింగ్ మిషన్లు సక్రమంగా పనిచేసే విధంగా చూడాలన్నారు . ఇసుక డిపోలకు చుట్టూ పెన్సింగ్ వేయాలని జిల్లా ఇసుక అధికారికి కలక్టర్ సూచించారు . అదే విధంగా వాడు - నేడు నిర్మాణపనుల్లో భాగంగా సిమ్మెంట్ సరఫరా చేసే వారి పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు . కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినందున పాఠశాలల్లో చేపడుతున్న నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ వీలు లేదని కలక్టర్ తెలిపారు . ఈ సమావేశంలో జెసి ( ఆర్ ) జి.లక్ష్మీశ , జెసిఁడి ) కీర్తి చేకూరి , కాకినాడ నగర్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ , జసిఁడబ్ల్యూ ) జి.రాజకుమారి . ఎస్.ఇ బి అడిషనల్ ఎస్.పి సుమిత్ గరుడ , డిఇఓ ఎస్ అబ్రహం , పిఓ ఎస్ఎస్ఎ బి.విజయ్ కుమార్ , పరిశ్రమల శాఖ జి.ఎమ్ బి . శ్రీనివాస్ , ఎస్.ఇ ఆర్ డబ్ల్యుఎస్ గాయిత్రిదేవి , ఎస్.ఇ పంచాయితీ రాజ్ నాగరాజు , జిల్లా ఇసుక అధికారి బి.రవికుమార్ , ఎడి మైన్స్ డివిఆర్ కుమార్ , కెసిపి . పెన్నా , భవ్య సిమెంట కం పెనీ ప్రతినిధులు . రాక్ సిరామిక్ . అపర్ణ కం పెనీల ప్రతినిధులు . ఇతర అధికారులు పాల్గొన్నారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved