పర్యాటకానికి..కరోనా షాక్..

పర్యాటకానికి..కరోనా షాక్..

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

కరోనా.. పర్యాటకాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకాభివృద్ధి సంస్థకు గరిష్ఠ ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్న తూర్పు పర్యాటక డివిజన్‌ కుదేలైంది. పర్యాటక శాఖకు మార్చి, ఏప్రిల్‌, మే నెలలు కీలకం. వేసవి సెలవుల్లో వచ్చే ఈ మూడునెలలే ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. కొవిడ్‌ కారణంగా పర్యాటకుల సందడే లేకుండా పోయింది. పర్యాటకశాఖ ప్యాకేజీలు, రంపచోడవరం ,అన్నవరం ,సముద్ర తీరం తోపాటు జిల్లా వ్యాప్తంగా వివిధ పర్యాటక ప్రాంతాల ద్వారా నెలకు రూ.5 కోట్ల ఆదాయం వచ్చేది. కొవిడ్‌-19 కారణంగా పర్యాటకశాఖ పర్యాటకుల సేవకు పూర్తిగా దూరం కావడంతో మూడునెలల్లో రూ.15 కోట్ల నష్టం వచ్చింది. జిల్లా లో పర్యాటక కోసం అత్యాధునిక వసతులు కలిగిన బస్సులు, ఇతర వాహనాలు ఉన్నాయి. కాకినాడ ,రాజమహేంద్రవరం తోపాటు పలు ప్రాంతాల నుంచి ప్యాకేజీల రూపంలో పర్యాటకులు వస్తుంటారు. ఏజెన్సీ ప్రాంతంలో రెస్టారెంట్లు ప్రభుత్వ అతిథి గృహాలలో ఆన్లైన్లో పెద్ద ఎత్తున వ్యాపారం జరిగేది వేలాది మంది కుటుంబాలు ఆదాయం అధిక మొత్తం లో వచ్చేది జిల్లాలోని పర్యాటక శాఖ రిసార్టులు, హోటళ్ల ద్వారా అదనపు ఆదాయం సమకూరేది. డివిజన్‌లో అన్ని హోదాల్లో కలిపి 272 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారిలో శాశ్వత ఉద్యోగులు 10 మందే. మిగిలిన వారంతా పొరుగుసేవలు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్న వారే ఉపాధి నిల్.. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పర్యాటక పై జీవించే వారికి ఉపాధి కరువైంది గత 70 రోజులుగా జిల్లాలో లాక్ డౌన్ ప్రకటించడంతో పర్యాటకుల రాక ఉపాధి లేక ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొన్నాయి

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved