రణరంగంగా మారిన రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవం....

రణరంగంగా మారిన రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవం....

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మడికి 1 రైతు భరోసా కేంద్రం ఓ కమ్యూనిటీ హాలులో చేస్తున్న ప్రారంభోత్సవం రణరంగంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సేవలు రైతు ముంగిటికే అనే నినాదంతో గ్రామ పంచాయతీతో పాటు సచివాలయానికి ఒక్కొక్క రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుా శనివారం ప్రారంభోత్సవానికి సిద్ధమయింది. అయితే మండలంలోని 24కు గాను 23 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభోత్సవం అవగా మడికి గ్రామ పంచాయతీకి చెందిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేయడానికి ఆలమూరు ఎంపిడివో జె.ఎ.ఝాన్సీ, ఏవో పద్మజ కేంద్రం వద్దకు చేరుకోగా ఒక వర్గానికి చెందిన వారు రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు. ఈ భవనం ఎవరికి చెందినది కాదని గ్రామంలోని అందరూ విరాళాలు సేకరించి నిర్మించుకున్నామని మహిళలతో పాటు రైతులు పట్టుబట్టడంతో విషయం తెలుసుకున్న మండపేట రూరల్ సిఐ మంగాదేవి, ఎస్సై సుభాకర్లు రంగప్రవేశం చేసి ఇరువర్గాలతో చర్చలు నిర్వహిస్తున్నారు. కాగా మరో వర్గం వారు తెలిపిన వివరాలు ఓ దాత స్థలాన్ని విరాళంగా ఇవ్వగా బిసి కార్పొరేషన్ సమకూర్చిన నిధులతో బిసి కమ్యూనిటీ హాలుగా నిర్మించారని తెలిపారు. అయితే ప్రభుత్వం సమకూర్చిన నిధులతో నిర్మించిన ఈ భవనం ప్రభుత్వానిదే కనుక మరో మూడు నెలల్లో సొంత భవనం నిర్మాణం పూర్తి అవుతుంది కనుక కమ్యూనిటీ హాలులో ఆర్ బీకే కేంద్రాన్ని కేవలం మూడు నెలల పాటు నిర్వహిస్తామని అధికారులు చెప్పినా మరో వర్గం వారు నిరాకరించడంతో పోలీసులు రంగప్రవేశం చేయవలసి వచ్చింది.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved