కరోనాకష్టంలో.. చిరువ్యాపారులను నిరాశ్రయం చేయడం తగదు..

కరోనాకష్టంలో.. చిరువ్యాపారులను నిరాశ్రయం చేయడం తగదు..

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

కరోనాలాక్ డౌన్ తో నగరంలోని చిరువ్యాపా రులు 3నెలలుగా ఉపాధికోల్పోయి అలమ టిస్తున్నారని సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. వీరిని ఆదుకోవా ల్సిన ప్రభుత్వం వారి కష్టాలు గమనించకుండా పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టుగా గురువారంనాడు రాజా రామ్మోహన్ రాయ్ రోడ్డు వంటి పలు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ అసౌకర్యం లేని చిరువ్యాపారుల బండ్లు, బల్లలు తొలగించే చర్యలు మున్సిపాలిటీ చేపట్టడం వలన వారి కుటుంబాలు నిరాశ్రయం అవుతున్నాయని అన్నారు. గతంలో జరిగిన రోడ్ల విస్తరణ యందు బడ్డీలు తొలగించిన మున్సిపాలిటీ అప్పటి ప్రభుత్వ జీవో ప్రకారం ప్రభుత్వ కార్యాల య మున్సిపల్ స్థలాల్లో పెట్టీ షాపులు నిర్మిస్తామని తెలిపి నప్పటికీ ఉపాధి ఆశ్రయా లుగా తోపుడు బండ్లు బల్లలు పెట్టు కునే అవకాశం మాత్రమే ఇచ్చి నిర్లక్ష్యం చేయడం జరిగింద న్నారు. ఇప్పుడు ఈ అవకా శాలు కూడా లేకుండా కరోనా కష్ట కాలంలో నిరాశ్రయం చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. మున్సిపాలిటీ గుర్తింపు కార్డులు, బ్యాంకు రుణాలు కల్పించి చిరువ్యాపారులకు ఉపాధి ఆశ్రయాలు కోల్పో కుండా ఆదుకోవాలని రమణ రాజు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గాందేయమార్గంగా ప్రజాందోళన చేపట్టడం.. చిరు వ్యాపారులు నిరాశ్రయులు కాకుండా మానవ జీవన హక్కు లపై హైకోర్టు ను ఆశ్రయించడం జరుగుతుందని పేర్కొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved