29నుంచి ఐదో విడత రేషన్ పంపిణీ

29నుంచి ఐదో విడత రేషన్ పంపిణీ

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

జిల్లాలో రేషన్‌ కార్డుదారులకు ఐదవ విడత రేషన్‌ సరకుల పంపిణీ ప్రక్రియను ఈనెల 29 నుంచి ప్రారంభించనున్నారు. జిల్లా లోని 9,21,054మందికి కార్డుదారులకు ఐదవ విడత రేషన్‌ పంపిణీ కింద బియ్యాన్ని, శనగలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఒక్కో వ్యక్తికి ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని, కిలో చొప్పున శనగలను చౌకధరల దుకాణాల ద్వారా అందజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో కార్డునకు అర కిలో చొప్పున పంచదారను రూ.10కు అందజేయనుంది. అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కార్డుదారులకు కిలో పంచదారను రూ.13.50కు పంపిణీ చేస్తారు. 18 వేల టన్నుల ధాన్యాన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి రేషన్‌ డీలర్లకు సరఫరా చేసే ప్రక్రియ కొనసాగుతోంది. 1,280 టన్నుల శనగలను ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి ద్వారా డీలర్లకు సరఫరా చేస్తామని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు తెలిపారు. కొత్తగా తెల్లరేషన్‌కార్డులుసరుకులు.. జిల్లాలో కొత్తగా తెల్లరేషన్‌కార్డులు పొందిన 8,500 మంది లబ్ధిదారులకు ఉచిత రేషన్‌ మంజూరయిందని జిల్లా పౌరసరఫరాల అధికారి పి.ప్రసాదరావు తెలిపారు. కొత్త కార్డులు మంజూరైనవారు ఆధార్‌ కార్డులను చౌక దుకాణాలకు తీసుకువెళ్లి సరకులు పొందాలని సూచించారు. ఉచిత రేషన్‌ పంపిణీలో బుధవారం నాటికి 9,21,054 కార్డుదారులకు సరకులు అందజేసినట్లు తెలిపారు. నిబంధనలు తప్పనిసరి.. ఐదవ విడత రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకులు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైంది లాక్ డౌన్ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు కొరకు సరుకులు అందజేస్తారు ఇప్పటికే ఇంటికి కార్డుదారులకు వాలంటీర్లు కూపన్లు పంపిణీ చేశారు భౌతిక దూరాన్ని పాటిస్తూ సరుకులను తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved