క్వారైంటన్లో కనీస వసతులు లేవంటూ ఆగ్రహం

క్వారైంటన్లో కనీస వసతులు లేవంటూ ఆగ్రహం

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

స్థానిక జెఎన్టీయుకెలో మామిడాడ ప్రజల ఆందోళన బయటకు వచ్చి నినాదాలు కాకినాడ: కాకినాడ జెఎన్టీయుకె క్వారైంటన్ లో ఉన్న పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన సుమారు 213 మంది అనుమానితులు ఆందోళన బాట పట్టారు. పాజిటివ్ నిర్ధారణ అయినా వ్యక్తులను ప్రత్యేకంగా తరలించకుండా తమతోనే కలిపి ఉంచడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్వారైంటన్ నుండి బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. తమ ఆవేదను, ఆందోళనను అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. క్వారైంటన్లో ఉన్న కొంతమంది వారి ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెదపూడి మండలం గొల్లల మామిడాడలో కరోనా పాజిటివ్ తో మృతి చెందిన వ్యక్తిని ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ అయినా సుమారు 213 మందికి పైగా కాకినాడ జెఎన్టీయుకె క్వారైంటన్ కు తరలించారు. వీరిలో సుమారు 28 మందికి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్దరించారు. అయితే పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ప్రత్యేకంగా ఉంచకుండా తమతో ఉంచారంటూ భయాందోళనకు గురవుతున్నారు. వాళ్ళ ద్వారా తమకు పాజిటివ్ వస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో కలిసి ఉండటం వల్ల తమను ఉంచటం సరికాదని, వాళ్ళను ప్రత్యేకంగా తరలించాలని అక్కడి వైద్య సిబ్బందికి ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. అంతే కాకుండా నాణ్యత లేని బోజనాలు పెడుతున్నారని, బాత్రూమ్ లు క్లీనింగ్ చేయడం లేదని, సరైన వసతులు లేవంటూ ఫిర్యాదు చేసిన తమ వినతిని పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు. దీంతో వారంతా ఒక్కసారిగా బయటకు వచ్చి నిరసన తెలిపారు. తమ సమస్యల పై ఆందోళన చేసారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వారు కోరుతున్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved