కాకినాడ కమిషనర్ గాస్వప్నిల్‌ దినకర్‌పుండ్కర్‌ బాధ్యతలు స్వీకరణ

కాకినాడ కమిషనర్ గాస్వప్నిల్‌ దినకర్‌పుండ్కర్‌ బాధ్యతలు స్వీకరణ

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు నూజివీడు ఉప కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన్ను బదిలీపై కాకినాడ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక్కడ కమిషనర్‌గా పనిచేస్తున్న రమేష్ అనూహ్యంగా విశాఖపట్నం ఆర్డీగా బదిలీ కావడం జరిగింది ఈ క్రమంలో ఖాళీగా ఉన్న ఆ పోస్టుకు స్వప్నిల్‌ను ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు స్వీకరించినస్వప్నిల్‌ విలేకరులతో మాట్లాడుతూ అందరి సహకారంతో పనిచేస్తానని, నగర అభివృద్ధికి కృషి చేస్తానన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డిమర్యాదపూర్వకంగా కలిశారు. కమిషనర్ ను కలిసిన అధికారులు, ఉద్యోగ సంఘం నాయకులు.. కాకినాడ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినస్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ను కార్పొరేషన్ అధికారులు ఎస్సీ సత్యనారాయణ రాజు ఈ ఈ సత్యమారి మోహన్ సింగ్ ,అదనపు కమిషనర్నాగనరసింహరావు ,డా ప్రశాంత్ కుమార్ కాలేష్ , రామ్మోహన్ రావు డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రావు మేనేజర్ మురళి సెక్రటరీ కే సత్యనారాయణ ఆర్ ఓ శామ్యూల్ తదితరులు కమిషనర్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved