స్వధార హోమ్ ను పరిశీలించిన న్యాయమూర్తి హిమబిందు

స్వధార హోమ్ ను పరిశీలించిన న్యాయమూర్తి హిమబిందు

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని స్వధార హోంను జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వి.ఎల్.హిమబిందు బుధవారం పరిశీలించారు. స్వధార హోంపై వివిధ పత్రికల్లో వచ్చిన కధనాలకు స్పందించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆధేశాల మేరకు న్యాయమూర్తి హిమబిందు హోంను పరిశీలించారు. అక్కడ ఉన్న యువతులతో మాట్లాడారు. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి హిమబిందు మాట్లాడుతూ మహిళలు ఉంటున్న హోంకు మహిళా గార్డులనే నియమించాలన్నారు. హోంలో నలుగురు యువతులను వాచ్ మెన్ వేధింపులకు గురిచేయడం, వారిని అనేక రకాలుగా భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బంది పెట్టడం దారుణమని, దీనిపై పూర్తి విచారణ జరిపి సంబంధిత అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవడంతో పాటు బాదిత యువతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. న్యాయమూర్తితో పాటు డిఎల్ఎస్ఎ సూపరింటెండెంట్ ఆర్.వి.నాగమణి, ప్యానల్ న్యాయవాది ధర్నాలకోట వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved