విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి  

విద్యుత్ బిల్లులు రద్దు చేయాలి  

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్‌ బిల్లులను రద్దు చేయాలని జిల్లా కాంగ్రెస్ నగర అధ్యక్షుడు వెంకటరమణ కోరారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాలని నెలన్నర క్రితం ప్రభుత్వం చెప్పిందని, దీంతో ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ ఇళ్లకే పరిమితమయ్యారని అన్నారు. పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఏ కేటగిరీలో ఉన్న వారిని బీ, సీ కేటగిరీలో చేర్చి స్లాబ్‌లు పెంచి భారీగా విద్యుత్‌ చార్జీలు పెంచడం దారుణమన్నారు. కరెంట్‌ బిల్లులను 200, 300 శాతం అధికారులు ఇష్టమొచ్చినట్లు పెంచారని ఆయన ఆరోపించారు. పేద, మధ్య తరగతి ప్రజలు బిల్లులు కట్టే స్థితిలో లేరని, అయినా ముక్కు పిండి వస్తోందని అన్నారు. డాక్టర్ సుధాకర్ ను మానసిక వైద్యులకు పోలీసులు చూపించాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులుతాళ్లూరి రాజు, కడియాల శ్రీనివాస్షేక్ సర్దార్ ,పిట్టా అర్జున్ ,కుక్కల పోతురాజు ,బావిశెట్టిసత్యానారాయణ ,జుట్టు క సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved