కాకినాడలో ఉద్రిక్తత

కాకినాడలో ఉద్రిక్తత

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

మడ అడవుల సందర్శన కోసం తెలుగుదేశం పార్టీ శుక్రవారం పిలుపునిచ్చింది. మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, నిమ్మకాయల చినరాజప్ప, కె ఎస్ జవహర్ శుక్రవారం పార్టీ కార్యాలయం నుంచి పోర్టు భూములకు వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో వారిని పార్టీ ఆఫీస్ నుంచి కదలకుండా పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమల్లో ఉందని, పైగా సంబంధిత స్థలం న్యాయస్థానాల్లో ఉన్నందున ఎవరు వెళ్లడానికి లేదంటూ పోలీసులు నచ్చచెప్పారు. అయితే తాము భూములు చూసేందుకు వెళతామని నాయకులు పట్టుబట్టడంతో వారిని బయటకు రాకుండా పోలీసు బృందాలు అడ్డుకున్నాయి. దీంతో తెలుగుదేశం నాయకులు, పోలీసుల మధ్య వివాదం నెలకొంది. అవసరమైతే నాయకులను అరెస్టు చేసేందుకు పోలీసులు సంసిద్ధంగా ఉన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved