ఏపీలో ఆకర్షణీయ నగరాలకు 1174 కోట్లు

ఏపీలో ఆకర్షణీయ నగరాలకు 1174 కోట్లు

user-default Phaneendra Malireddy | Mob: 7794982345 | 14 Oct

ఆకర్షణీయ నగరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు రూ.1174 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ తెలిపారు. ఈ అంశంపై భాజపా సభ్యుడు టి.జి.వెంకటేశ్‌ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విశాఖపట్నానికి రూ.294 కోట్లు, తిరుపతికి రూ.196 కోట్లు, కాకినాడకు రూ.294 కోట్లు, అమరావతికి రూ.390 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 33 పట్టణాల్లో అమృత్‌ను అమలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అమృత్‌పై రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రూ.2,890.17 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఆమోదించామని తెలిపారు. ఇందులో కేంద్ర వాటా రూ.1,056.62 కోట్లని తెలిపారు. చెన్నై, కోల్‌కతాల్లో కొత్త ఎయిర్‌పోర్టులు చెన్నై, కోల్‌కతా ఎయిర్‌పోర్టుల్లో రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉన్నందున అక్కడ కొత్తవి నిర్మించే ఆలోచన ఉన్నట్లు పౌరవిమానయానశాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పూరీ తెలిపారు. బుధవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. విజయవాడ, హైదరాబాద్‌ నుంచి డిజీయాత్ర ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి విజయవాడ, హైదరాబాద్‌తోపాటు కోల్‌కతా, పుణే, వారణాసి, బెంగళూరు, కొచ్చిన్‌, ముంబాయి, దిల్లీ ఎయిర్‌పోర్టుల నుంచి విమాన ప్రయాణికులకు డిజీయాత్ర అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్రమంత్రి పూరీ తెలిపారు. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రయాణికులు ప్రతి గేటు దగ్గర టికెట్‌, గుర్తింపు కార్డు చూపించాల్సిన అవసరం లేకుండా నేరుగా విమానం వద్దకు చేరుకొనే వెసులుబాటు అందుబాటులోకి వస్తుందన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved