21పరిశ్రమలలో ప్రత్యేక బృందం తనిఖీలు

21పరిశ్రమలలో ప్రత్యేక బృందం తనిఖీలు

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

జిల్లాలో మేజర్ యాక్సిడెంట్స్ హజార్డ్ అవకాశం ఉన్న 21 పరిశ్రమ లలో భద్రతా ప్రమాణాలు , రక్షణ వ్యవస్థల సంసిద్ధత పరిశీలనకు తనిఖీలు , మాక్ డ్రిల్ లు నిర్వహిస్తున్నామని జిల్లా పరిశ్రమల కేంద్రం జియం బి . శ్రీనివాసరావు తెలిపారు . ఈ నెల 9వ తేదీన జరిగిన జిల్లా స్థాయి ఇండస్ట్రియల్ ఎమర్జెన్సీ ప్రిపేర్డ్ నెస్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను మేరకు పరిశ్రమలను పర్యవేక్షించే 5 శాఖ ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఈ తనిఖీలు నిర్వహిస్తోందని ఆయన తెలిపారు . ఇందులో భాగంగా జాయింట్ చీఫ్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివశంకర్ రెడ్డి , ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్ పి . రాంబాబు , పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీర్ రామారావు నాయుడు , జిల్లా అగ్నిమాపక అధికారి రత్నబాబు , జియం , డిఐసి బి . శ్రీనివాసరావు లతో కూడిన బృందం మంగళవారం ఎన్ . ఎఫ్ . సి . ఎల్ . , కోరమాండల్ , స్పెష్టం సంస్థల లో తనిఖీలు నిర్వహించిందని ఆయన తెలిపారు . రోజుకు 3 నుండి 6 పరిశ్రమల్లో ఈ తనిఖీలను ఈ నెల 12 నుండి 16 వ తేదీ వరకూ జిల్లాలోని 21 మేజర్ యాక్సిడెంట్స్ హజార్డ్ పరిశ్రమ లలో భద్రత , రక్షణ వ్యవస్థల పరిశీలన నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved