విద్యుత్ బిల్లులు పాత విధానాన్ని అమలు చేయండి

విద్యుత్ బిల్లులు పాత విధానాన్ని అమలు చేయండి

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

విద్యుత్ బిల్లులు 30 రోజులు మాత్రమే యూనిట్లుగా విభజించి రెండు నెలలకు విడివిడిగా తీసి పాత విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తూర్పుగోదావరి జిల్లా సమితి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ,ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాదు ,సిపిఐ నగర కార్యదర్శి టి.అన్నవరం మంగళవారం జాయింట్ కలెక్టర్ ను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది .ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ కరోనా కష్టాలకు తోడు కరెంట్ కష్టాలు ప్రజలు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయని ఆయన అన్నారు .ఈ కష్టకాలంలో కరెంటు చార్జీలు పెంచుతున్నట్లు విద్యుత్ సంస్థలు ముందుగా ప్రకటించకుండా అమలు చేయడం సరికాదన్నారు .రెండు నెలలకు పైగా రీడింగ్ ఒకేసారి తీసి విద్యుత్ చార్జీలు పెంచడం వల్ల స్లాబ్ లో పెరిగి రెట్టింపు ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి దాపురించిందని ఆయన అన్నారు. లాక్ డౌన్ కారణంగా వేసవిలో ఈ సారి ప్రజలంతా ఇళ్లల్లోని గడపడంవల్ల దీంతో రీడింగ్ పెరిగిందని ఇప్పటికైనా ప్రభుత్వం ఈ వైఖరిని విడనాడాలని ఆయన తెలియజేశారు .ఈ సమస్య పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన తెలియజేశారు . అదేవిధంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ జాయింట్ కలెక్టర్ కువివరిస్తూ వలస కార్మికులు కాకినాడలో ఇంకా ఉన్నారని వీరికి కనీసం భోజనం కూడా సదుపాయం లేదని వీరిని ప్రభుత్వమే రైల్వే సదుపాయం కల్పించి వారి సొంత గ్రామం ఆయన కోరారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved