వైన్ షాపుల వద్ద సి పి ఐ ఆందోళన?

వైన్ షాపుల వద్ద సి పి ఐ ఆందోళన?

user-default ఈశ్వర ప్రసాద్ | Mob: 9848234566 | 17 Sep

జగన్ గారు మద్యం ఆపండి 14 రకాల నిత్యవసర వస్తువులు ఇవ్వండి కాకినాడలో బహుదూరం పాటిస్తూ సిపిఐ ప్రదర్శన ముఖ్యమంత్రి జగన్ గారు మీరు తక్షణమే మద్యాన్ని ఆపాలని ,అదేవిధంగా రేషన్ షాపుల్లో 14 రకాల నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాలని కోరుతూ సిపిఐ ,ఏ ఐ టి యు సి ,ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కాకినాడలో భౌతిక దూరం పాటిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు .అనంతరం గాంధీనగర్ వైన్ షాప్ వద్ద గంటపాటు ఆందోళన నిర్వహించారు .అంతకుముందు ఏఐటియుసి కార్యాలయం నుండి బయలుదేరిన ప్రదర్శన రామారావు పేట సూపర్ బజార్ ,మూడు లైట్స్ జంక్షన్ మీదుగా సుబ్బయ్య హోటల్ ఎదురుగా ఉన్న వైన్ షాప్ వద్దకు చేరుకుంది. మద్యం నిషేధించాలని, నిత్యవసర వస్తువులు ఇవ్వాలని ,వలస కార్మికులు ఆదుకోవాలని ,భవన నిర్మాణ కార్మికులకు 10 వేలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ ర్యాలీ సాగింది .షాపులో వెంటనే మూసివేయాలని కోరుతూ మహిళలు కార్యకర్తలు షాపు వద్దకు వెళ్లి మీకు దండం పెడతాను సార్ మూసేయండి వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ ప్రపంచ మహమ్మారి కరునో మూలంగా లక్డౌన్ వల్ల అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా వలస కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న కరోనా ను దేశమునుండి తగ్గించడానికి స్వచ్ఛందంగా లాక్ డోన్ కు ప్రజలు సహకరించాఋ .కానీ ఒకేసారి మద్యం షాపులు తెరవడం వల్ల షాపుల ముందు వందలాది మంది ఒకేసారి రావడంతో కరోనా ను మనమే తీసుకొచ్చే పరిస్థితి వచ్చిందన్నారు .అయినా ముఖ్యమంత్రి గారు ప్రజలకు మందు కావాలా నిత్యావసర వస్తువులు కావాలా అని ఆలోచించాలని ఆయన కోరారు .ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ మాట్లాడుతూ కాకినాడ ప్రాంతం నుండి వలస కార్మికులు వాళ్ల సొంత ఊరికి పంపలేదని దీనిపై జిల్లా యంత్రాంగానికి చిత్తశుద్ధి లేదని ఈ జిల్లా మాత్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ,కన్నబాబు జోక్యం చేసుకుని వెంటనే వలస కార్మికులు వారు సొంత ప్రాంతం పంపాలన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి జి లోవ రత్నం ,కోశాధికారి వీరమణి ,సిపిఐ నగర కార్యదర్శి టి .అన్నవరం ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శివకోటి రాజు, అగ్రిగోల్డ్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీను ,బాబి ,ఏఐవైఎఫ్ నగర అధ్యక్షులు వెంకన్న బాబు , నగర కార్యవర్గ సభ్యులు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved