కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ అధికారికంగా రాజీనామా

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ అధికారికంగా రాజీనామా

user-default | Mob: | 17 Sep

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాహుల్‌ గాంధీ బుధవారం బహిరంగంగా ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నట్లు తెలిపిన ఆయన... పార్టీ పునఃనిర్మాణానికి కఠిన నిర్ణయాలు అవసరమని అభిప్రాయపడ్డారు. పార్టీని పూర్తిగా సంస్కరించాల్సి ఉందని చెప్పారు. ఈ మేరకు సీడబ్ల్యూసీకి రాసిన నాలుగు పేజీల లేఖను బుధవారం ఆయన ట్విటర్‌ ద్వారా బహిర్గతం చేశారు. తన స్థానంలో నూతన అధ్యక్షుడిని ఎంపిక చేసే బాధ్యతను ఒక బృందానికి అప్పగించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీకి సూచించారు. కొత్త నేతను తానే ఎంపిక చేయాలనటం భావ్యంకాదని స్పష్టం చేశారు. రాహుల్‌ రాజీనామా చేసినప్పటికీ ఆయనే తమ అధ్యక్షుడని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొన్నాయి. కొత్త నేత ఎంపిక పూర్తయ్యే వరకూ అధ్యక్షుడిగా రాహులే కొనసాగుతారని తెలిపాయి.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved