రాష్ట్ర వ్యాప్తంగా జొమేటో , సిగ్వీ ద్వారా ఇంటి వద్దకే కూరగాయలు పంపిణీ..రాష్ట్ర మంత్రి

రాష్ట్ర వ్యాప్తంగా జొమేటో , సిగ్వీ ద్వారా ఇంటి వద్దకే కూరగాయలు పంపిణీ..రాష్ట్ర మంత్రి

user-default suresh gona | Mob: 7799146666 | 17 Sep

రాష్ట్ర వ్యాప్తంగా జొమేటో , సిగ్వీ ద్వారా ఇంటి వద్దకే కూరగాయల పంపిణీ చేయడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు . మంగళవారం కాకినాడ రమణయ్యపేట మంత్రి క్యాంపు కార్యాలయం నందు మార్కెటింగ్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన ఆన్ లైన్ పద్ధతిలో కూరగాయల అమ్మకాలను మంత్రి కన్న బాబు ప్రారంభించారు . ఈ సందర్భంగా మంత్రి కన్న బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్ల ద్వారా సిగ్వీ , డీమేట్ ఆన్లైన్ పద్ధతిలో కనీసం వంద రూపాయల ఆర్డర్ పై ఇంటివద్దకే తాజా కూరగాయలు , పండ్లు సరఫరా చేయడం జరుగుతుందన్నారు . గత మూడు రోజులుగా మార్కెటింగ్ శాఖ ట్రైల్స్ నిర్వహించి ఈ రోజు నుండి అధికారికంగా ఆన్లైన్ పద్ధతిలో పండ్లు , కూరగాయలు అమ్మకాలు ప్రారంభమవుతాయన్నారు . మార్కెటింగ్ శాఖ వారు 56 రకాల కూరగాయలను ఒక లిస్టు గా తయారు చేయడం జరిగిందని అదేవిధంగా ఉద్యానశాఖ ఎనిమిది రకాల తాజా పండ్లను ఎంపిక చేయడం చేయడం జరిగిందన్నారు . జమోటో , సిగీ యాప్ ద్వారా కనీసం వంద రూపాయల విలువ చేసే ఆడర్ పై కూరగాయలు , పండ్లను సెలెక్ట్ చేసుకుంటే వారి ఇంటివద్దకే తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుందన్నారు . రైతులకు మేలు జరిగే విధంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు . దీనిలో భాగంగానే ఈ రోజునుండి జమోటో , సిద్వీ , మహిళా సంఘాల ద్వారా గ్రామస్థాయి వరకు పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు . మన రైతులు పండించిన పండ్లు కూరగాయలు మనమే కొనుగోలు చేసుకునే విధంగా ప్రజలందరూ ఈ విధానాన్ని వినియోగించుకోవాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ బెండ విష్ణుమూర్తి , మార్కెటింగ్ శాఖ ఏడి కె . వి . ఆర్ ఎన్ . కిషోర్ , వ్యవసాయ శాఖ ఏడి పద్మశ్రీ , కాకినాడ ఆర్టీసీ బస్టాండ్ రైతు బజార్ , గాంధీనగర్ రైతు బజార్ల ఈవో లు ఆర్ . శ్రీనివాసరావు వెంకట రాజన్ , నాయకులు , తదితరులు పాల్గొన్నారు .

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved