తూర్పు గోదావరి లో జోన్ల వివరాలు

తూర్పు గోదావరి లో జోన్ల వివరాలు

user-default Babi Mahendra Malireddy | Mob: 7794982345 | 17 Sep

తూర్పుగోదావరి జిల్లాలో ని మొత్తం 64 మండలాలు. ఇందులో రాజమహేంద్రవరం నగరం, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, రాజమహేంద్రవరం రూరల్‌, రాజానగరం, కడియం, శంఖవరం మండలాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి. ఇవికాకుండా అత్యధిక జనసమ్మర్థం కలిగిన పట్టణ ప్రాంతాలను రెడ్‌జోన్‌లో ఉంచాలని కేంద్రం ఆదేశాల నేపథ్యంలో అన్ని మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు కూడా రెడ్‌జోన్‌ పరిధిలో కొనసాగుతున్నాయి. ఇవి మినహా జిల్లాలో మిగిలిన మండలాలన్నీ గ్రీన్‌జోన్‌ పరిధిలో ఉన్నాయి. అయితే కాకినాడ నగరం రెడ్‌జోన్‌లో ఉన్నా కొత్త పాజిటివ్‌ కేసులు గడిచిన 28 రోజుల్లో ఏవీ లేనందున గ్రీన్‌జోన్‌గా ప్రకటించారు. కొత్తపేట, రాజమహేంద్రవరంలో 37వ వార్డు, కాతేరు, పెద్దాపురంలో 16వ వార్డును గ్రీన్‌జోన్‌లోకి తీసుకువచ్చారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండడంతో రెండు వారాల కిందట తూర్పుగోదావరిని కేంద్రం రెడ్‌జోన్‌గా ప్రకటించి హాట్‌స్పాట్‌ జిల్లాగా గుర్తించింది. తాజాగా శుక్రవారం ప్రకటించిన జాబితాలో తూర్పును ఆరెంజ్‌ జోన్‌గా ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలో ఎక్కడా ఆరెంజ్‌ జోన్‌లో లేవు. నిబంధనల ప్రకారం ఏదైనా ప్రాంతంలో కోవిడ్‌ కేసు వస్తే దాన్ని రెడ్‌జోన్‌గా గుర్తిస్తారు. కేసు వచ్చిన తేదీ నుంచి వరుసగా 14 రోజుల వరకు కొత్త కేసు లేకపోతే ఆ ప్రాంతం ఆరెంజ్‌ జోన్‌లోకి వస్తుంది. ఆ తర్వాత మరో 14 రోజుల వరకు కేసులు నిర్ధారణ కాకపోతే గ్రీన్‌జోన్‌లోకి వస్తుంది. కానీ జిల్లాలో ఆరెంజ్‌ జోన్ల ప్రస్తావన లేకుండా 28 రోజులపాటు ఏకబిగిన రెడ్‌జోన్‌ కొనసాగించి ఆ తర్వాత గ్రీన్‌జోన్‌లోకి చేర్చారు

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved