విశాఖ నుంచి కొత్త విమానాలు

విశాఖ నుంచి కొత్త విమానాలు

user-default Sathya | Mob: 9248040968 | 17 Sep

ట్రూజెట్‌, స్కూట్‌ విమానయాన సంస్థలు విశాఖపట్నం కేంద్రంగా ఆదివారం నుంచి తొలిసారి విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నాయి. ఇండిగో, స్పైస్‌జెట్‌ సంస్థలు అదనపు విమానాల్ని నడపనున్నాయి. సింగపూర్‌కు మళ్లీ విమానాలు మొదలవుతున్నాయి. * స్పైస్‌జెట్‌ విశాఖ- విజయవాడ- విశాఖ- చెన్నై సర్వీసును ఆదివారం ప్రారంభిస్తోంది. వారానికి 6 రోజులు నడుస్తుంది. * స్కూట్‌ విమానం ఆదివారం నుంచి అందుబాటులోకి వస్తోంది. సింగపూర్‌, విశాఖల మధ్య తిరగనుంది. * ట్రూజెట్‌ సంస్థ ఆదివారం నుంచి రోజూ నడిచేలా విశాఖ-హైదరాబాద్‌ సర్వీసును తెస్తోంది. * హైదరాబాద్‌ నుంచి రోజువారీ ఇండిగో విమానం విశాఖ వచ్చి.. తిరిగి వెళ్తుంది. మరో విమానం కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌ వచ్చి, అక్కడి నుంచి విశాఖకు చేరుకుని తిరిగి హైదరాబాద్‌కు వెళ్తుంది. * స్పైస్‌జెట్‌ విమానం కోల్‌కతా నుంచి విశాఖ వచ్చి తిరిగి వెళ్తుంది. * ఇదివరకు రద్దు చేసిన విశాఖ- దిల్లీ సర్వీసును ఆదివారం నుంచి స్పైస్‌జెట్‌ పునరుద్ధరిస్తోంది.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved