26 మందిని కాపాడిన రియల్ హీరోస్

26 మందిని కాపాడిన రియల్ హీరోస్

user-default | Mob: | 17 Sep

మీకు కనిపిస్తున్న ఫోటోలో ఉన్న వారందరూ కూడా ఏమీ ఆశించకుండా ప్రాణాలతో 26 మందిని. కాపాడిన నిజమైన రియల్ హీరోస్. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసే వారు కూడా చుట్టు మందీ మార్బలం విపరీతమైన లైటింగ్ ఉన్న ఒక చిన్న పిల్ల కాలువలో దిగటానికి ఎన్నో ట్రైల్స్ వేసిన అనంతరం దిగుతారు. అటువంటిది గత నెల 14వ తారీఖున తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరులో జరిగిన పడవ ప్రమాదంలో సుమారు 150 నుంచి 200 అడుగుల పైన సుడులు తిరిగే నీటిలో కూడా వారికి కనిపించిన ప్రమాదం‌‌. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్క ఉదుటున గోదావరిలో దూకి వాళ్ల శక్తిని అంతా కూడగట్టుకుని 26 మందిని కాపాడారు కనీసం వీరి వల్ల ప్రమాదం నుంచి బయటపడ్డ వారు గానీ ప్రభుత్వం గానీ అధికారులు నుండి కానీ కనీసం గుర్తింపు లేకపోవడం చాలా దారుణం. తన ప్రాణాల కన్నా మునిగిపోతున్న వారిని కాపాడటమే వీరి ముందున్న ధ్యేయంగా కాపాడిన ఇటువంటి గిరిపుత్రుల గుర్తించకపోవడం వల్ల మిగతా వారికి కూడా అలసత్వం వచ్చే ప్రమాదం ఉంది. ఎవరెలా పోతే నాకేంటి అని వీరు అనుకుంటే ఆరోజు ఇంకో ఇరవై ఆరు కుటుంబాలు రోడ్డున పడి ఉండేవి వీరు ఏమీ కాంట్రాక్ట్ తీసుకోలేదు అలాగే లోతు కొలవ లేదు, ఎవరి సాయం కూడా తీసుకోలేదు. కానీ 26 మంది ప్రాణాలను కాపాడిన రియల్ హీరోస్ ఇప్పటికైనా వీరిని గుర్తించి అందరికీ తెలిసేలా అభినందిస్తే చాలామందికి వీరు పడిన కష్టానికి సార్థకత లభిస్తుంది.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved