అత్తసొమ్ము...అల్లుడు దానం?

అత్తసొమ్ము...అల్లుడు దానం?

user-default | Mob: | 17 Sep

ఆంధ్ర ప్రదేశ్ లోని దేవాలయ భూములు - ఇళ్లస్థలాలు : 3 నెలల క్రితం ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పడిన ప్రభుత్వం “ 2020 ఉగాది న అందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న ఆలోచనతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ ఆగష్టు 28 వ తేదీ 2019 న జి.ఓ . ఆర్ టీ .no : 1937 ను విడుదల చేసింది . దీనిప్రకారం ‘ లాయర్లకు , పూజారులకు , ఇమామ్ లకు , పాస్టర్ లకు, ప్రభుత్వ ఉద్యోగులకు , పేదలకు , జర్నలిస్ట్ లకు , మరియు ఇతర వర్గాలకు ఇంటి స్థలాల పంపిణీ కోసం స్థల సేకరణ ... ఇతర విధివిధానాలు నిర్ణయించటం ‘ కమిటీ ఏర్పాటు యొక్క ముఖ్య ఉద్దేశం ‘. ఇప్పటికే మిగతా వర్గాల ప్రజలుకూడా mla లను , మంత్రులను కలిసి తమకు కూడా ఇళ్ల పట్టాలను ఇప్పించాలని వినతిపత్రాలు ఇస్తున్నారు . ఇంతవరకు ఎవరికైనా అంతాసవ్యం గానే ఉన్నట్లు అనిపిస్తుంది . ఇంతమందికి ఇళ్లపట్టాలు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర భూమి ఉన్నదా అన్నది ఒక పెద్ద ప్రశ్న ? ఒకవేళ ప్రభుత్వ భూమి లేకపోతే , కొని అయినా ఇవ్వటానికి “ ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదు “. మరి ఇంతమందికి ఇళ్లస్థలాలు ఎలా ఇవ్వాలి ? ఒక్కసారి మీరుకూడా ఆలోచించండి !!! ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ క్రిందివిధంగా ఉన్నదని వార్తలు వస్తున్నాయి . అది ‘ దేవాలయాల భూములను ఇళ్లస్థలాలుగా పంపిణీ చేయటం ‘. దీనివలన ప్రభుత్వం పై ఎటువంటి భారం పడదని ‘ప్రభుత్వ పెద్దల ఆలోచన’ . వాస్తవం : 1950 నుండి వివిధ సందర్భాలలో ‘ సుప్రీమ్ కోర్ట్ ‘ ఈ విధంగా తీర్పుచెప్పింది అది ‘ దేవాలయాల భూములు ప్రభుత్వ భూములు కావని , అవి దాతలు / ధర్మకర్తలు ఒక ప్రత్యేక విధికోసం ( దేవుడి సేవ కోసం) తమ వ్యక్తిగత ఆస్తులను ఆలయాలకు వితరణగా ఇచ్చారని ... ప్రభుత్వం తన ఇష్టానుసారం దేవాలయ భూములను దారాదత్తం చేయటం చట్టవ్యతిరేకమని చెప్పింది ‘. జూన్ 2018 లో ఉమ్మడి హైకోర్టు జస్టిస్ రమేష్ రంగనాథన్ , జస్టిస్ ఉమాదేవి లతో కూడిన ధర్మాసనం “ అమరావతి లోని అమరలింగేశ్వర స్వామి ఆలయభూముల విషయంలో కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. 16 సంవత్సరాల క్రితం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 4 ఎకరాల ఆలయ భూమిని సాంఘికసంక్షేమ హాస్టల్ కట్టటానికి ఇచ్చింది ”. గుడికి ఏవిధంగానూ compensate చేయలేదు . దీనిపై బెంచ్ ప్రభుత్వాన్ని ఈవిధంగా ప్రశ్నించింది “ హైకోర్టు అనుమతిలేకుండా ఆలయభూములను ప్రభుత్వం ఏవిధంగా అన్యాక్రాంతం చేస్తుంది అని ప్రశ్నించింది ?” . ‘ 10 సంవత్సరాల క్రితం ఇదే కోర్టు ‘ ప్రభుత్వాలు ఆలయభూములను 3 rd పార్టీ కి ఇచ్చేముందు విధిగా హై కోర్ట్ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని తీర్పునిచ్చింది....ఆ తీర్పును ప్రభుత్వం విధిగా అమలుచేయాలని చెప్పింది’ . దేవాలయాల భూమిని ‘ బహిరంగ వేలంద్వారా మాత్రమే అమ్మాలని , అదికూడా ధర్మకార్యాలు ( ఆ గుడిలోని దేవుడి సేవకు) అవసరమైతే మాత్రమే అమ్మాలని తీర్పులో ఉటంకించింది ‘. . ‘ అమరావతిలోని గుడికి ఎకరాకు 24 లక్షల చొప్పున , 24 శాతం వడ్డీకట్టి ( 96 లక్షలు + వడ్డీ ) 2 నెలలో డబ్బులు జమచేయమని ఆదేశించింది ‘. ( మూలం : టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిక , జూన్ 26 వ తేదీ 2018 ) విషయం సులువుగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ‘ అత్తసొమ్ము ( దేవుడి సొమ్ము ) , అల్లుడు (ప్రభుత్వం) దానం చేయటం ‘లాంటిది . తనదికాని ఆస్థిని , ఇళ్లస్థలాలుగా దానం చేస్తానంటుంది నేటి మన రాష్ట్ర ప్రభుత్వం. కాల పరీక్షకు నిలబడిన హిందూ దేవాలయాలు : 5000 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన దేశం ‘భారతదేశం’. ఈ సమాజం ఎన్నో ఎత్తుపల్లాలను , ఆటుపోట్లను ఎదుర్కొంది . గడచిన వెయ్యిసంవత్సరాలలో పాలకులు ‘ ముస్లిమ్స్ ‘ ‘బ్రిటిష్ క్రిస్టియన్స్ ‘ అయినా ఇక్కడ హిందూ మతం మూలాలు చెక్కుచెదరలేదు . కారణం ఏమిటంటే ‘ హిందూ సంస్కృతీ కి మూలమైనవి ఒకటి వ్యక్తిగత నియమనిబంధనలు - స్వేచ్ఛ ; రెండవది గుడి . ముస్లిం పాలకులు మత మార్పిడికి పాల్పడినా , గుడి ( గుడి అనే వ్యవస్థ ) యొక్క ఆర్ధిక మూలలను దెబ్బకొట్టలేదు . ( కొద్దిమంది ముస్లిం పాలకులు గుడి లోని చరాస్తులు - డబ్బు ,బంగారం , వజ్రాలు వగైరాలను దోచుకున్నారు ..... కానీ స్థిరాస్తి అయిన గుడిమాన్యాలను ఎన్నడూ రద్దు చేయలేదు ). 1000 సంవత్సరాలలో ముస్లిం పాలకులు , బ్రిటిష్ వారు కూడా చేయని పనులు స్వతంత్ర భారతదేశంలోని ‘ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు , వాటిని నడిపే నాయకులు ‘ చేస్తున్నారు . 1 . ఆంధ్ర ప్రదేశ్ లోని హిందూదేవాలయాల లోని ఉద్యోగస్థులలో 30 - 40 % మంది అన్యమతస్థులు . ( ఔరంగజేబు ఉన్నప్పుడు కూడా ముస్లిం ఉద్యోగస్తులను , అధికారులను హిందూ దేవాలయాల అధికారులుగా నియమించలేదు ). 2 . హిందూ దేవాలయాల భూములను (స్థిరాస్తులను) ‘ రాజకీయాల కోసం వేరేవారికి దారాధత్తంచేయటం ‘. హిందూ దేవాలయాలు చరిత్రలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని స్వతంత్రంగా నిలబడటానికి ముఖ్య కారణం “ బలమైన ఆర్ధిక మూలాలు ఉండటమే “. ఇప్పుడు ఆ బలమైన ఆర్ధిక మూలాలను కూకటివేళ్లతో పెకిలించటానికి చేస్తున్న ప్రయత్నమే ‘ దేవాలయ భూములను - ఇళ్లస్థలాలుగా ‘ మార్చి పంపిణీ చేయటం . కుట్ర : పాలకుల సహాయ సహకారాలున్నా , లేకున్నా ‘ దేవాలయాలు ‘ నిలబడటానికి ముఖ్యమైన కారణం ‘ దేవాలయ భూములు ( స్థిరాస్తి ) ‘.ఇప్పుడు వాటిని అందరికి పంపిణీ చేస్తే ... ఇక దేవాలయాలు తిరిగికోలుకోలేవు . ప్రభుత్వం యొక్క దయాదాక్షిణ్యం మీద ఆధారపడాల్సిందే ... అప్పుడు ఖజానా ఖాళీగా ఉన్నదని చెప్తూ నిధులివ్వకుండా ఉంటే ....నిదానంగా దేవాలయాలన్నీ శాశ్వతంగా మూతపడతాయి ‘ అన్నది వారి వ్యూహం . మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వై.యస్ .రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ‘ తిరుమల వెంకటేశ్వర స్వామి - ఏడుకొండల వెంకన్నవి ‘ ఏడుకొండలు కావని , రెండుకొండలేలని ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చారు . ప్రజలలో వ్యతిరేకత వస్తుందని గ్రహించిన అప్పటి ముఖ్యమంత్రి , ఉత్తర్వులు ఉపసంహరించారు . అప్పటి- ఇప్పటి ప్రభుత్వం లోని వ్యూహకర్తలు వ్యూహాన్ని మార్చి ..... హిందూ ధార్మిక సంస్థలను బలహీన పరచటానికి సరికొత్త వ్యూహాన్ని రచించారు . వ్యూహం : డబ్బుల పంపిణీ చేయటం ద్వారా మతమార్పిడులకు పాల్పడి - విజయం సాధించిన వారు , అటువంటి తాయిలాల వ్యూహాన్ని “ అందరికీ ఇళ్ల స్థలాల పంపిణీ చేయటం అనే నూతన కార్యక్రమాన్ని రూపొందించారు” . ఎవరికీ సందేహం రాకుండా ఉండటం కోసం ఇమామ్ , పాస్టర్లతో పాటు .....పూజారులకు కూడా ఇళ్లస్థలాలు ఇస్తామనటం అందులో భాగమే. ఈ అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించకుండా ఉండటం కోసం ..... లాయర్లకు , జర్నలిస్టులకు , ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇవ్వబోతున్నారు . ఇంకా ఏవర్గ ప్రజలు అడిగినా ఇస్తామంటున్నారు . ప్రజల మనస్తత్వంలో వచ్చిన మార్పులను పూర్తిగా అవగాహన చేసుకొని రచించిన వ్యూహం ఇది ... “ ఇప్పటి ప్రజలలో ఎక్కువమంది ... నాకు వ్యక్తిగతంగా కొద్దిగా లాభం వస్తే చాలు , సమాజానికి ఏమైతేనాకేంటీ అన్న భావనే రాజ్యమేలుతుంది “. కావున ఇళ్ల స్థలాలు అడిగిన వారందరికీ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి .... దేవాలయ భూములు మీకు పంచుతామని చెప్తుంటే ... ప్రతిపక్షాలు , ఇతర సంస్థలు అడ్డుపడుతున్నాయని ప్రచారం చేస్తారు ‘. దీనిద్వారా సమాజంలో భాగమైన గుడి ఆస్తులను ( దేవుడి సొత్తును) కాపాడాల్సిన ప్రజలే.... దేవుడు సొమ్మును (భూమిని ) పంచమని అడుగుతారు , అడిగేలాగా చేస్తున్నారు. తద్వారా స్వలాభాపేక్ష కలిగిన హిందువులే ‘ హిందూ దేవాలయాల’ మూలాలను కూలదోసేవిధంగా వ్యూహాన్ని రచించారు . ప్రభుత్వం దేవాలయ భూములకు compensation ఇస్తే మీకు నష్టం ఏమిటి అన్నది ఒక వాదన ? 1 . అసలు హిందూ దేవాలయ భూములు అమ్మటానికి కారణం ఒకే ఒక్కటి . అది “ ప్రత్యేకంగా ఆ దేవాలయానికి ధార్మిక అవసరాలుండటమే ( ఆ గుడిలోని దేవుడి సేవకు ) “ . అప్పుడు మాత్రమే ‘ అదికూడా బహిరంగ వేలం ద్వారా మాత్రమే అమ్మాలి’ . 2 . ప్రభుత్వం ఇచ్చే compensation గురించి ఒక ఉదాహరణ - పశ్చిమ గోదావరి జిల్లా , అత్తిలి లోని వేణుగోపాలస్వామి ఆలయ భూములను ( రెండున్నర ఎకరాలను ) ప్రభుత్వం 2002 జనవరి 17 న భూసేకరణ కింద తీసుకుంది . అప్పట్లో ఆలయానికి ఎకరాకు ఒక లక్ష ఎనభైరెండు వేలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది ( అప్పటి మార్కెట్ విలువ కన్నా ప్రభుత్వం తక్కువ ఇస్తానంది ). ప్రభుత్వాలు మారాయి , ముఖ్యమంత్రులు మారారు , కొన్ని రాజకీయ పార్టీలు అంతరించిపోయాయి .... కొన్ని కొత్తవి పుట్టుకొచ్చాయి ... అయినా ఇప్పటివరకు ప్రభుత్వం దేవాలయానికి ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వలేదు ( 25 లక్షలు ). అప్పులిచ్చిన ఆసామి ‘మొండిబకాయి ‘ రాదని తెలిసినా ఆశ చంపుకోలేక ... పద్దుల పుస్తకంలో వడ్డీకట్టి , లెక్కలు రాస్తూ ... అంకెలు చూస్తూ తృప్తిపడినట్లుగా .... అత్తిలి వేణుగోపాలస్వామి గుడికి రావాల్సిన డబ్బులు కూడా పద్దుల పుస్తకంలోని కాగితాలపై చూసుకోవటమే !! 3 . ప్రభుత్వం compensation ఇచ్చిన తర్వాతనే ఇళ్ల పట్టాలు ఇస్తే హిందువులకు సమస్య ఉండదు కదా ? అన్నది ఇంకొక వాదన . ‘ ఒక వైపున భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా , అన్యమతస్థులు దేవాలయ యాజమాన్యంలో పెత్తనం చేస్తున్నప్పుడు ... దేవుడి సొత్తంతా డబ్బురూపేణ ఉంటే “ ఏమిజరుగుతుందో మీరే ఊహించండి “ . ( హుండీ లోని చిల్లరనే వదిలిపెట్టని వారు ... పెద్దమొత్తంలో డబ్బు ఉంటే జుర్రేయ్యకుండా ఉంటారా ? ) . గుడి అనేది ‘ 5 సం. లో - 10 సం. లో ’ ఉండే రాజకీయ పార్టీ కాదు , భారత నాగరికతలో శాశ్వతమైన స్థానం కలిగినది. దానిని కాపాడటానికి స్థిరాస్థులు ( భూములు ) ఉండాల్సిందే . ప్రభుత్వం ముందున్న alternatives ఏమిటి ? ‘ ప్రభుత్వ భూములు ఇవ్వటం (లేదా) డబ్బులు పెట్టి పౌరులనుండి భూములు కొనటం (లేదా ) ఔస్థాయికులు ( పార్టీ అభిమానులు , అందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న మేధావులు తదితరులు ) దగ్గర భూములు “ ల్యాండ్ పూలింగ్ “ విధానం ద్వారా తీసుకొని కొంత లబ్ధిదారులకు ఇళ్లస్థలాలు గా ఇచ్చి .... మిగతాది అభివృద్ధి చేసి భూయజమానికి ప్లాట్లుగా అమ్ముకోవటానికి ఇవ్వండి . అయినా ఒకవేళ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లాలనుకుంటే ముందుగా “ వేల ఎకరాల చర్చి భూములను , వక్ఫ్ భూములను ఇళ్లస్థలాలుగా పంచి ... అప్పుడు రండి హిందూ దేవాలయాల భూముల దగ్గరకు “ . చరిత్రలో ఎన్నో రాజకీయ పార్టీలు పుడుతుంటాయి ... కాలగర్భంలో కలిసిపోతుంటాయి , మహామహులు అంతరించిపోతుంటారు . కానీ కాలగతికి నిలబడిన హిందూ దేవాలయాల, ఆర్ధిక మూలాలైన ఆలయభూములను కాపాడటం మన ధర్మం. మనందరి కర్తవ్యం.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved