రాజీనామా చేసి షాకిచ్చిన రాఘవేంద్ర రావు.. వైఎస్ జగనే కారణమంటూ!

రాజీనామా చేసి షాకిచ్చిన రాఘవేంద్ర రావు.. వైఎస్ జగనే కారణమంటూ!

user-default Neelam Gopi | Mob: 7396901317 | 17 Sep

దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్‌గా గత కొంతకాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఉన్నట్టుండి తాజాగా ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీటీడీ ఈవోతో పాటుగా ప్రభుత్వానికి కూడా పంపించారు. వయస్సు పైబడిన కారణం గానే తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా రాఘవేంద్ర రావు లేఖలో పేర్కొన్నారు. రాజీనామా లేఖలో రాఘవేంద్రరావు ఏమన్నారంటే.. దర్శకడుు రాఘవేంద్ర రావు 2015 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఎస్వీబీసీ ఛానల్‌కు ఛైర్మన్‌ గా ఉన్న నరసింహా రావుపై ఆరోపణలు రావడంతో ఆయనను తొలగించి.. 2018లో రాఘవేంద్రరావును ఛైర్మన్‌గా టీటీడీ నియమించింది. అప్పటి నుంచి ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తున్న ఆయన ఉన్నట్టుండి రాజీనామా చేయడం వెనుక అనేక కారణాలున్నాయని టాక్ నడుస్తోంది.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved