టాక్సీ స్టాండ్ ఆద్వర్యంలో అన్నదానం

టాక్సీ స్టాండ్ ఆద్వర్యంలో అన్నదానం

user-default | Mob: | 17 Sep

కాకినాడ:కాకినాడ టాక్సీ స్టేoడ్ గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు లో భాగంగా బుధవారం భారీ అన్నదానం జరిగింది.లక్ష్మీ గణపతి టాక్సీ ఓనర్లు, డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 6వేల మంది ప్రజలు అన్న ప్రసాదం స్వీకరించారు.1985లో స్థానిక బాలాజీ చెరువు సెంటర్ లో ఏర్పడిన ఈ టాక్సీ స్టేoడ్నగర విస్తరణ లో భాగంగా ఇంద్రపాలెం లాకులు వద్దకు20సంవత్సరాల క్రితం మార్చారు. నవరాత్రులు తొలి రోజు గంగాధర్ సినీ మ్యూజిక్ నైట్ జరిగేది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోనే మంచి పేరుంది. ఇందులో సినీ నేపధ్య గాయకులు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జానకి, పిఠాపురం నాగేశ్వరరావు, స్థానిక కళాకారులు పాటలు ఆలపించేవారు. కాలక్రమంలో అలనాటి సాంప్రదాయాలను అనుసరించి నవరాత్రులు, అన్నదానం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నామా ప్రకాష్, కార్యదర్శి చంద్రశేఖర్, దుర్గారావు, వల్లి రమణ, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Message

Copyright 2018 © Saukaryam  | All Rights Reserved